: వరుసగా 11 సార్లు గెలిచిన రాజకీయ యోధుడు
ఏ ఎన్నికల్లో అయినా వరుసగా గెలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా మందికి వరుసగా రెండోసారి గెలవడం కూడా కష్టసాధ్యమే. అయితే ఈయన మాత్రం ఓటమి అనేదే ఎరుగకుండా వరుసగా 11వ సారి గెలుపొందారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప సింగ్ రానే. గోవాలోని పోరియం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన తన ప్రత్యర్థిపై 4286 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో తొలిసారి పోటీ చేసిన ప్రతాప్ సింగ్ అప్పటి నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు.