: ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 'ఉత్తమ'ప్రదేశ్ గా మారింది: స్వరాజ్


ఇన్నేళ్ల పాటు అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 'ఉత్తమ'ప్రదేశ్ గా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి స్వరాజ్ అన్నారు. యూపీ ప్రజలు కుటుంబ పాలనను, అవినీతి పాలనను, కుల రాజకీయాలను దూరం పెట్టారని... అభివృద్ధిని మాత్రమే విశ్వసించారని కొనియాడారు. యూపీ ఓటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేయదని... వారి నమ్మకాన్ని నిలబెడతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళతామని చెప్పారు. ఒక స్పష్టమైన మార్పును యూపీ ప్రజలు ఇప్పటి నుంచి చూస్తారని తెలిపారు. 

  • Loading...

More Telugu News