: యూపీలో బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచిన ముస్లిం మహిళలు... అందుకే ఇంత ఘనవిజయం!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న వేళ, ఇంత భారీగా ఆ పార్టీకి ఓట్లు పడటానికి గల కారణాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూపీలో 20 శాతం వరకూ ఓట్లున్న ముస్లిం వర్గంలోని మహిళలు, ముఖ్యంగా విద్యాధికులు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచినట్టు వారు ఊహిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ఇటీవల బీజేపీ తీసుకున్న చర్యలే వారిని ఆ పార్టీకి ఓట్లు వేసేలా చేశాయని, ఆపై పేదలకు ఉచిత వంట గ్యాస్ పథకం, నోట్ల రద్దు అంశాలు కూడా ప్రభావితం చేశాయని అంచనా వేస్తున్నారు. ముస్లిం మహిళల్లో ఎంతో ఆందోళన కలిగించే ఇస్లాం చట్టాల్లోని 'ట్రిపుల్ తలాక్' చెల్లబోదని బీజేపీ వాదిస్తుండటం, ఆ వర్గం మహిళలను దగ్గర చేసిందని అంచనా వేస్తున్నారు. యూపీలో ముస్లిం ఓట్లు పడకుండా ఇంత భారీ మెజారిటీ సాధించడం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.