: మణిపూర్ లో వెనుకబడ్డ ఉక్కు మహిళ షర్మిల


మణిపూర్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ముందంజలో ఉంది. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు, ప్రజా హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల వెనుకబడ్డారు. కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటి నుంచే ఆమె వెనుకబడిపోయారు. ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబీపై ఆమె పోటీకి దిగారు.

కాసేపటి క్రితం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన పార్టీలు అంగబలాన్ని, అర్థబలాన్ని బహాటంగానే ప్రదర్శించాయని విమర్శించారు. అయితే, ప్రజలు మార్పును కోరుకుంటారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆమె పార్టీ పీఆర్ జేఏ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వెనుకబడే ఉంది.  

  • Loading...

More Telugu News