: యూపీలో ఓటమి దిశగా ములాయం చిన్న కోడలు... భారీ ఆధిక్యంలో రేప్ ఆరోపణల మంత్రి
యూపీ రాజధాని లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమెపై బీజేపీకి చెందిన రీటా బహుగుణా జోషి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని సభ్యుడు ప్రజాపతి భారీ ఆధిక్యంలో గెలుపు దిశగా సాగుతున్నారు. అలహాబాద్ లో సిద్ధార్ధనాథ్ సింగ్ ముందంజలో ఉండగా, పంజాబ్, అమృతసర్ లో సిద్దూ ఆధిక్యంలో ఉన్నారు.