: ఏడాదికి వందమంది ఆర్మీ సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ప్రభుత్వం


ఏడాదికి వందమంది ఆర్మీ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. 2016లో 125 మంది ఆర్మీ సిబ్బంది ఆత్మహత్యలతో తమ ప్రాణాలు తీసుకున్నారని రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ భమ్రే ఓ ప్రశ్నకు సమాధానంగా సభకు తెలిపారు. సైనికుల్లో ఒత్తిడి తగ్గించడం ద్వారా ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతేడాది ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 101 మంది సైనికులు, 19 మంది వాయుసేన సిబ్బంది, ఐదుగురు నావికులు ఉన్నారన్నారు. తోటి సైనికులను, అధికారులను చంపిన కేసులు మూడు నమోదైనట్టు వివరించారు. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది జవాన్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు మంత్రి సభకు తెలిపారు.

  • Loading...

More Telugu News