: కాంగ్రెస్, టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేద్దామా?: మంత్రులను అడిగిన కేసీఆర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నాడు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్, టీడీపీలు వ్యవహరించిన తీరును సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ ను అవమానించినందుకు, వీరందరినీ చేద్దామా అంటూ అడిగారు. కాంగ్రెస్ వాకౌట్ చేయడం, తెలుగుదేశం పార్టీ సభ్యుల నినాదాలు తదితరాలను ప్రస్తావించిన కేసీఆర్, జరిగిన ఘటనలపై సభలో క్షమాపణలు కోరిన పక్షంలో వీరిని వదిలి పెడదామని, లేకుంటే సస్పెండ్ చేద్దామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న ప్రతిపక్షం సైతం గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేసిన కేసీఆర్, ఏవైనా అభ్యంతరాలుంటే, తరువాత చర్చించే వీలున్నప్పటికీ, వారు తమ వైఖరిని ప్రదర్శించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ ను అగౌరవపరిచిన వీరంతా క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుందామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.