: ఆ అంశంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే వారి పంచెలు ఊడదీస్తారు: మంత్రి తుమ్మల


పక్కా ఇళ్ల అంశంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని, వాటి గురించి మాట్లాడితే, ప్రజలు వారి పంచెలు ఊడదీస్తారని  తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తమ ప్రభుత్వ పథకం అయిన ‘డబుల్ బెడ్ రూమ్స్’పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం వినకుండానే సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గవర్నర్ అవాస్తవాలు చెప్పారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించడం సబబు కాదని, దీనిపై చర్చకు సిద్దమా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనావేదన సభలు, టీడీపీ ప్రజాపోరు యాత్రలపై ఆయన విమర్శలు కురిపించారు.

  • Loading...

More Telugu News