: తల్లి తెలిసి విషం తాగితే...పిల్లలు తెలియక విషం తాగారు!


అనారోగ్య సమస్యతో తల్లి విషపూరితమైన పురుగుల మందును పాలల్లో కలుపుకుని తాగితే... ఆ విషయం తెలియని పిల్లలు ఆ పాలు తాగిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...మైలార్ దేవి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీలో విజయలక్ష్మి(38) కుటుంబంతో కలిసి ఉంటోంది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఉదయం నుంచీ ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. దానిని భరించలేకపోయిన ఆమె ఆత్మహత్యకు పాల్పడడం ద్వారా ఆ బాధనుంచి విముక్తి పొందాలని భావించింది. దీంతో విషపూరితమైన పురుగుల మందును పాలలో కలిపి తాగింది. దీనిని గుర్తించని ఆమె పిల్లలు యశస్విని (6), యశ్వంత్‌ (4) ఆ పాలని తాగారు. దీనిని గమనించి స్థానికులు ముగ్గుర్నీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యశస్విని మృతి చెందగా, విజయలక్ష్మి, యశ్వంత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News