: 37 ఏళ్లుగా ఒకే రంగు, డిజైన్ దుస్తులతో కనిపిస్తోన్న ముచ్చటైన జంట ఫొటోలు!
ఈ జంట అందరిలోకీ విభిన్నమైన జంట. ఎందుకంటే, ఇద్దరిదీ ఎప్పుడూ ఒకే మాట .. ఒకే బాట.. అంతేకాదు.. తమ ప్రేమకు చిహ్నంగా వీరిద్దరూ ఎప్పుడూ ఒకే తరహా డ్రెస్సులను ధరిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. జపాన్‌కు చెందిన ఈ జంటకు 37 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే రకం దుస్తులు ధరిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. పైగా ఇంతవరకు ఎప్పుడూ తామిద్దరం ఒక్కసారి కూడా వేరు వేరు డిజైన్, రంగు దుస్తులను ధరించలేదని గర్వంగా చెబుతున్నారు. వీరి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరు వేసుకునే దుస్తుల్ని వారు బొన్పొన్511 పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉంచుతున్నారు. వీరి ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వేలకొద్ది లైకులు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.
I love these two! Meet Bon and Pon, the stylish Japanese 'silver surfers' who have become Instagram stars https://t.co/9dHvuH4TBy pic.twitter.com/DlikgQsLvt
— Anna Fifield (@annafifield) 8 March 2017