: గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా అధికార, విపక్ష సభ్యులంతా హాజరయ్యారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ సభ్యులు మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్నవన్నీ అవాస్తవాలే అని ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు గవర్నర్ ప్రసంగంలో లేనే లేవని వారు విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు ఊసే లేదని, దళితులకు మూడెకరాల భూమి కేటాయింపు విషయం మర్చిపోయారని అన్నారు. పేద ప్రజల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస ప్రేమ కూడా లేదని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News