: 24 గంటల్లోనే యూ టర్న్ తీసుకున్న పేటీఎం
ప్రముఖ నగదు చెల్లింపుల మాధ్యమ సంస్థ పేటీయం యూ టర్న్ తీసుకుంది. 24 గంటలు కూడా గడవక ముందే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్ ను రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు 2 శాతం ఛార్జీ విధిస్తామంటూ నిన్న పేటీఎం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తమ నిర్ణయం యూజర్లకు అసౌకర్యం కలిగించిందనే విషయం తమకు తెలిసిందని... అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని పేటీఎం తెలిపింది. చాలా మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వాలెట్ లోకి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి, ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదును బదిలీ చేసుకుంటున్నారని... దీని వల్ల తాము నష్టపోతున్నామని, అందుకే 2 శాతం ఛార్జీ విధిస్తున్నట్టు పేటీఎం నిన్న తెలిపింది.