: ప్రతి రోజు ఒక బాటిల్ కల్లు లాగిస్తున్న బర్రె!


కల్లు తాగే కోతుల గురించి విన్నాం. కల్లు తాగిన తర్వాత అవి చేసే చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఓ బర్రె కూడా ప్రతి రోజూ ఓ బాటిల్ కల్లు లాగించేస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఈ బర్రెకు దాని యజమాని ఎల్లారెడ్డి ప్రతి రోజూ కల్లు పట్టిస్తున్నాడు. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా కల్లు తాగిస్తున్నాడు. బర్రెకు ఎందుకు కల్లు తాగిస్తున్నావు? అని అతన్ని మీడియా ప్రతినిధి అడగ్గా... ఎండాకాలం కదా, కల్లు తాగితే బర్రెకు వేడి తగ్గి, చల్లగా ఉంటుందని అతను చెప్పాడు. ఏదేమైనా, తమ జంతువులను ఇంత ప్రేమగా చూసుకోవడం అభినందించదగ్గ విషయమే.

  • Loading...

More Telugu News