: పవన్ కల్యాణ్ ని వెంటాడుతున్న బ్యాక్ పెయిన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలంగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారట. దీని ప్రభావం తన సినిమాల్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణపై కూడా పడుతోందని అంటున్నారు. ఇటీవల ‘కాటమరాయుడు’ చిత్రంలో ఓ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ సమయంలో ఇది కనిపించిందట. ఇందులో ఓ చోట శ్రుతిహాసన్ ను పవన్ ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఓ సన్నివేశం వుంది. అయితే, అందులో నటించడానికి పవర్ స్టార్ ‘నో’ చెప్పారట. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న పవన్, డాక్టర్ల సలహా మేరకే ఆ సన్నివేశంలో నటించలేనని చెప్పారని సమాచారం.