: కోహ్లీ! నువ్వు కూడా స్మిత్ లాగే చెయ్...ఏం జరుగుతుందో చూద్దాం!: గవాస్కర్ సలహా


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దిగ్గజ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కొత్త సలహా ఇచ్చాడు. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔటైన సందర్భంగా పెవిలియన్ కు చేరకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు సూచనల కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. ఇది పెను వివాదానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని కూడా అలాగే చేయాలని గవాస్కర్ సూచించాడు. అప్పుడేం జరుగుతుందో చూద్దామని గవాస్కర్ సలహా ఇచ్చాడు. అప్పుడు ఐసీసీ ఎలా స్పందిస్తో చూద్దామని అన్నాడు. కాగా, ఘటన జరిగి రోజులు గడుస్తున్నా స్మిత్ పై ఐసీసీ చర్యలు తీసుకోకపోవడం పట్ల గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, గత కొంత కాలంగా (శశాంక్ మనోహర్ ఐసీీసీ చీఫ్ అయిన తరువాతి నుంచి) ఐసీసీ, బీసీసీఐ పట్ల సహేతుకంగా ప్రవర్తించడం లేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News