: పాకిస్థాన్ లో పరువు కోసం వందలాది మహిళలను చంపేస్తున్నారు!


పాకిస్థాన్ లో ఉగ్రవాదమే కాదు, పరువు హత్యలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి ఏటా వేలాది మంది మహిళలు పరువు హత్యలు, వేధింపుల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ సామాజికవేత్త సర్వర్ బారీ తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఇస్లామాబాద్ లో 'పని ప్రదేశాల్లో మహిళలు సురక్షితమేనా' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బారీ... మహమ్మద్ అలీ చూపిన దారిలో నడవకుండా.... మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కుటుంబ పరువు కోసం సొంత కుటుంబ సభ్యులే ఏటా వందలాది మంది మహిళలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు పేరిట మహిళలను హత్య చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని చెప్పారు.

  • Loading...

More Telugu News