: మేం చూపించింది అంగీకరించాల్సింది కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్షం కాదు: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటుపై తాము అనుసరించిన విధానం సమగ్రమైనదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాము చూపించిన వృద్ధి రేటును అంగీకరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే కాని, ప్రతిపక్షం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయని... రెవెన్యూ తగ్గుతోందని చెప్పారు. గత బడ్జెట్ కంటే ఈసారి ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణాలు, పుష్కరాల నిర్వహణకు ఖర్చు ఎక్కువయిందని చెప్పారు. ఈ బడ్జెట్ లో యూత్ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. నిరుద్యోగులకు భృతి ఎలా ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఎంబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.