: వర్మకు వార్నింగ్...క్షమాపణలు చెప్పకుంటే చెప్పులతో కొడతాం...సెగ మొదలైంది!


ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్వీట్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నయి. గోవాలో హక్కుల కార్యకర్త కేసు నమోదు చేయించగా, ముంబైలో ఎన్సీపీ నేత విద్యాచవాన్ తీవ్ర స్థాయిలో వర్మపై ధ్వజమెత్తారు. రాంగోపాల్ వర్మ తక్షణం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే వర్మకు చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు.

మరో వైపు మహిళలపై వర్మచేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సినిమా సెట్టింగ్, దాని అనుబంధ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేవరకు వర్మ సినిమాలకు పని చేయకూడదని నిర్ణయించారు. కాగా, ఈ అనుబంధ సంఘాల్లో సుమారు 52 వేల మంది కార్మికులు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వర్మకు వ్యాఖ్యల సెగ తగులుతున్నట్టు తెలుస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మహిళ సన్నీలియోన్ లా ఆనందింపజేయాలని కోరుతున్నానని పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్ ఈ దుమారానికి కారణమైంది. 

  • Loading...

More Telugu News