: త్వరలోనే కొత్త రూ. 10 నోటు.. ఫీచర్స్ ఇవే!
త్వరలోనే కొత్త 10 రూపాయల నోట్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. కొత్త నోట్లు వస్తున్నప్పటికీ... పాత 10 రూపాయల నోట్లు కూడా చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.
కొత్త 10 రూపాయల నోటు ప్రత్యేకతలు ఇవే...
- ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఈ నోట్లు రానున్నాయి.
- మహాత్మాగాంధీ సిరీస్-2015లో రెండు ప్యానెల్స్ పై 'ఎల్' అక్షరం (ఇన్ సెట్) ఈ నోటుపై ఉంటుంది.
- ఎడమ నుంచి కుడికి నోటు మీద ఉన్న నంబర్ ఆరోహణ క్రమంలో ఉంటుంది.
- నంబర్ కు ముందున్న మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ క్యారెక్టర్లు ఒకే సైజులో ఉంటాయి.
- ముద్రిత సంవత్సరం 2017 నోటుకు ఒక వైపు ఉంటుంది.