: ఆ హీరో తలకు హుడీ, ముఖానికి రుమాలు కట్టుకున్నా ఓ బాలుడు గుర్తుపట్టేశాడు !


బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబయి లోకల్ ట్రైన్ లో పది రోజులు ప్రయాణించాడట. అయితే, తనను  ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో తన తలకు హుడీ, ముఖానికి రుమాలు కట్టుకుని సాధారణ ప్రయాణికులతో కలిసి పదిరోజుల పాటు ప్రయాణించాడు. అయితే, నిన్న సాయంత్రం అదే లోకల్ ట్రెయిన్ లో ఇంటికి వెళుతున్న టైగర్ ను ఓ బాలుడు గుర్తుపట్టేశాడు. ‘మీరు, టైగర్ ష్రాఫ్ కదూ?’ అని ప్రశ్నించడంతో.. అప్పుడు, టైగర్ తన తలకి ఉన్న హుడీని, ముఖానికి కట్టుకున్న రుమాలును తీసేశాడు. ఆ బాలుడితో సరదాగా కాసేపు ముచ్చటించాడు. ఆ కంపార్టుమెంట్ లో ఎక్కువ రద్దీ లేకపోవడం టైగర్ ష్రాఫ్ కు కొంత ఊరట నిచ్చింది. టైగర్ ష్రాఫ్ ‘మున్నా మైఖెల్’ సినిమా చిత్రీకరణ కోసం వాసాయ్ జాతీయ రహదారి వద్ద యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. అందుకే లోకల్ ట్రైన్ లో వెళుతున్నాడట.  

  • Loading...

More Telugu News