: 12 కేసుల్లో నిందితుడైన జగన్ ఏనాడైనా తన ఆస్తుల వివరాలను ప్రకటించారా?: నారా లోకేశ్
ఆస్తుల వివరాలను ఎంతో నిజాయతీగా ప్రకటించిన తనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆస్తులకు సంబంధించి మార్కెట్ విలువను ప్రకటించాలనేది ఎన్నికల సంఘం నిబంధన అని... ఈసీ నిబంధనలను కూడా ప్రతిపక్షం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. తన ఆస్తుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. తాను ప్రకటించిన ఆస్తులపై చర్చకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. మన దేశంలో ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటిస్తున్న తొలి రాజకీయ కుటుంబం తమదే అని తెలిపారు. 12 కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏనాడైనా తన ఆస్తుల వివరాలను ప్రకటించారా? అని లోకేశ్ ప్రశ్నించారు.