: ప్రయాణికుడి దుప్పటి గొడవ... దారి మళ్లిన విమానం


ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య దుప్పటి విషయంలో జరిగిన గొడవతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ సంఘటన అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగింది. వివరాల ప్రకారం అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి హవాయిలోని హోనోలుకు హవాయ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న 66 యేళ్ల ఓ ప్రయాణికుడు తనకు చలిగా ఉందని దుప్పటి కావాలని ఎయిర్ లైన్స్  సిబ్బంది అడిగాడు. దుప్పటికి రూ. 12 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది అతడికి తెలిపారు.

దీంతో కోపం తెచ్చుకున్న ఆ ప్రయాణికుడు సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు.  ఎయిర్‌లైన్‌ కార్పొరేట్‌ ప్రతినిధులతో తాను వెంటనే మాట్లాడాలని డిమాండ్‌ చేశాడు. విమానంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పైలెట్‌ అధికారులకు సమాచారం అందించి, వెంటనే విమానాన్ని లాస్‌ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించాడు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రయాణికులు, సిబ్బందితో మాట్లాడారు. వెంటనే అధికారులు సదరు ప్రయాణికుడిని మరో విమానంలో పంపించారు.

  • Loading...

More Telugu News