: దుమ్ము రేపిన 'ఖైదీ నంబర్ 150'.. వసూళ్లెంతో తెలుసా?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెండి తెరపై మెరిసిన మెగాస్టార్... తన రేంజ్ కు తగ్గట్టే సత్తా చాటారు. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ ను బద్దలు చేసింది. దాదాపు రూ. 160 కోట్లను ఈ సినిమా వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమా విజయం సాధించడంలో మెగాస్టార్ దే పూర్తి క్రెడిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, తెర వెనుక ఉండి సినిమాను అద్భుత రీతిలో మలచింది మాత్రం డైరెక్టర్ వీవీ వినాయక్. అందుకే వినాయక్ కు ఓ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ తేజ్ డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే 'శ్రీమంతుడు' సినిమాకు గాను మహేష్ బాబు నుంచి ఖరీదైన కారును, 'జనతా గ్యారేజ్' హిట్ అయినందుకు ఎన్టీఆర్ నుంచి విలువైన ఫ్లాట్ ను దర్శకుడు కొరటాల శివ అందుకున్నాడు. ఇప్పుడు వినాయక్ కు వీటన్నింటి కంటే భారీ గిఫ్ట్ ను ఇవ్వాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట.