: రెండు రోజుల పాటు వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సెలక్షన్స్
భారత్ మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరగనున్నాయి. నిజామాబాద్ లోని ఎంఎస్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 11, 12 తేదీల్లో తొలి విడత సెలక్షన్స్ ఉంటాయి. అనంతరం హైదరాబాద్ లోని వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీలో రెండో విడత సెలక్షన్స్ నిర్వహిస్తారు. సెలక్షన్స్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో రాణించిన క్రీడాకారులకు జూన్ నుంచి హెచ్ సీఏ నిర్వహించే లీగ్ మ్యాచుల్లో ఆడే అవకాశం కలుగుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ రోజు సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాల కోసం శ్రీనివాస్ (మొబైల్ నంబర్ - 9848945522) ను సంప్రదించవచ్చు