: ఎలా ఉంటుంది? ఎవరితో ఉంటుంది అనేగా..? అన్నీ ఉంటాయి!: అభిమానులకు బాలయ్య హామీ


తన కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్న వేళ, అల్లరి చేస్తున్న అభిమానులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారన్న సంగతి తనకు తెలుసునని అన్నారు. "వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని... అటువంటి ఓ మంచి క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. తప్పకుండా మా అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే రకంగా, అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను" అని అభిమానుల కోలాహలం మధ్య బాలయ్య ప్రకటించారు. ఇంకా కొందరు టెక్నీషియన్స్ ఫైనలైజ్ కావాల్సి వుందని, ఆ విషయాన్ని డైరెక్టర్ పూరి చూసుకుంటారని స్పష్టం చేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News