: అందరికీ నమస్కారం, ఇదో శుభముహూర్తం: బాలకృష్ణ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తన 101వ చిత్రం ప్రారంభమైన సందర్భంగా నటసింహం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. "ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనందప్రసాద్ నిర్మాతగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది... తులసివనంలో... ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద ముహూర్తపు షాట్ తీయడం జరిగింది. అభినందించేందుకు వచ్చిన సినీ పరిశ్రమ ప్రముఖులందరికీ నమస్కారం. ఆనంద ప్రసాద్ ఎంతో ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి. తులసివనం నుంచి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన నిర్మాతగా ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది" అన్నారు.