: టీవీ సీరియల్ గా రానున్న అంబేద్కర్ జీవిత చరిత్ర.. వెల్లడించిన మంత్రి రావెల
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఇక దృశ్యకావ్యంగా అలరించనుంది. ఆయన జీవిత చరిత్ర బడుగు బలహీన వర్గాల గుండెచప్పుడు కావాలనే ఉద్దేశంతో టీవీ సీరియల్‌గా చిత్రీకరిస్తున్నట్టు ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. ఈ మేరకు గుంటూరు పరిసరాల్లోని కొండల్లో దర్శకుడు దిలీప్ రాజు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు మంత్రి తెలిపారు. అంబేద్కర్ తండ్రి రాంజీ సక్పల్ మిలటరీలో ఉద్యోగం చేసేవారని, ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కొండల్లో చిత్రీకరించినట్టు పేర్కొన్నారు. అంబేద్కర్ బాల్యం నుంచి జననం వరకు జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సీరియల్‌ను వంద ఎపిసోడ్లలో ప్రసారం చేస్తామని మంత్రి వివరించారు.