: ఫొటోలు మారినా ఓటింగ్ ఆపే ప్రశ్నే లేదు: ఈసీ భన్వర్ లాల్
తెలంగాణలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలు మారిన విషయమై ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ స్పందించారు. ఈ విషయమై తమకు సమాచారం అందిందని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ను ఆపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అభ్యర్థుల పేరు, వరుస సంఖ్య ప్రకారం వేసిన ఓట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు. కాగా, మాణిక్ రెడ్డి ఫోటో స్థానంలో ఆది లక్ష్మయ్య ఫోటో రాగా, తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.