: ప్రాణ స్నేహితుడి అస్థికలను గంగలో కలిపి చివరి కోరిక తీర్చిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం స్టీవ్ వా!
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా స్నేహితుడి చివరి కోరికను తీర్చాడు. మంగళవారం వారణాసికి వచ్చిన ఆయన, గైడ్ సాయంతో మణికర్నిక ఘాట్ కు చేరుకున్నాడు. అక్కడి గంగలో తన స్నేహితుడు స్టీఫెన్ అస్థికలను నిమజ్జనం చేశాడు. విషయం తెలిసిన మీడియా అక్కడికి చేరుకుని ప్రశ్నల వర్షం కురిపించింది.
నాలుగు నెలల క్రితం మరణించిన తన స్నేహితుడి చివరి కోరికను తీర్చేందుకే ఇక్కడికి వచ్చానని స్టీవ్ వా పేర్కొన్నాడు. శ్రీకృష్ణ భక్తుడు, ఇస్కాన్ సభ్యుడు అయిన స్టీఫెన్ తనకు ప్రాణ స్నేహితుడని, మరణించే ముందు తన అస్థికలను గంగానదిలో కలపమని కోరాడని స్టీవ్ వా చెప్పాడు. అతడి చివరి కోరిక మేరకు అస్థికలను గంగలో నిమజ్జనం చేసేందుకు తన మరో స్నేహితుడు జాన్సన్ తో కలసి వచ్చానని తెలిపాడు.