: కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఏం సాధించాం?: పవన్ కల్యాణ్


ప్రతి ఏటా మార్చి నెల రెండో గురువారం నాడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అయితే ఏం సాధించామని ఆయన ప్రశ్నించారు. రేపు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ తరుణంలో ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని కూకటివేళ్లతో పెకలించాలని, ఈ ప్రాంతంలోని 120 గ్రామాల్లో 50 వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని, ఈ రోగం బారిన ఎందుకు పడ్డామో అని, కారణం తెలియక అమాయక ప్రజలు బాధ పడుతుంటే, అందుకు కారణం తెలిసిన ప్రజా ప్రతినిధులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని పవన్ విమర్శించారు. ఈ వ్యాధి బారిన పడ్డ పేదలు, నెలకు రూ.8 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం తక్షణం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పవన్ తన ప్రకటనలో కోరారు.

  • Loading...

More Telugu News