: శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై తీరిగ్గా ప్రధానికి లేఖ రాసిన కేన్సస్ గవర్నర్
అమెరికాలోని కేన్సస్ స్టేట్ లో జాత్యహంకార కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిపై కేన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంకా ఆ లేఖలో కేన్సస్ స్టేట్ లో జాతి వివక్షకు, అసహనానికి చోటు లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్, అలోక్ లపై చోటుచేసుకున్న హింసాత్మక దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటన కారణంగా శ్రీనివాస్ భార్య, అతడి కుటుంబ సభ్యుల వేదనను వర్ణించలేమని తెలిపారు.