: మన దేశంలో ప్రతి మహిళా రెజ్లరే!: సాక్షి మాలిక్ వీడియో సందేశం


మన దేశంలోని ప్రతి మహిళ రెజ్లరేనని ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పూర్తిమంతమైన వీడియో సందేశం ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో సాక్షి మాలిక్ మాట్లాడుతూ, తనలాగా కుస్తిలో పాల్గొనే క్రీడాకారులు మాత్రమే రెజ్లర్లు కాదని చెప్పింది. నిత్యం ఎన్నో సమస్యలతో పోరాడుతున్న ప్రతి మహిళా రెజ్లరేనని తెలిపింది. ఈ లెక్కన మన దేశంలో రోజూ కష్టపడి పనిచేస్తున్న ప్రతి మహిళా రెజ్లరేనని స్పష్టం చేసింది.

ఎన్నో సమస్యలతో సతమతమవుతూ సగటు మహిళ ఎవరికీ ఫిర్యాదు చేయకుండానే, ధైర్యంగా వాటిని ఎందుర్కొంటూ ముందుకు సాగిపోతోందని సాక్షి చెప్పింది. పోలీస్‌, చెఫ్‌, నర్స్‌ వృత్తి ఏదైనా మహిళలు ఎదుర్కొనే సమస్యలు లెక్కలేనివని తెలిపింది. వాటన్నింటినీ ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని సాక్షి ఆయా వృత్తులకు సంబంధించిన దుస్తులు ధరించి వీడియోలో కనిపించింది. 

  • Loading...

More Telugu News