: అమ్మాయిల వస్త్రధారణపై షాకింగ్ వీడియోతో ముందుకొచ్చిన తాప్సీ, స్వర భాస్కర్


సామాజిక సందేశాలు ఇవ్వడంలో సినీ నటులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. శ్రుతి హాసన్ ఆ మధ్య ఒక వీడియోతో ముందుకు రాగా, తాజాగా బాలీవుడ్ నటులు స్వరభాస్కర్, తాప్సీ పన్ను అభిమానుల ముందుకు సరికొత్త వీడియోతో వచ్చారు. ఈ వీడియో సందేశంలో మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసే మగాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఎంతవరకు క్లీవేజ్ ఉంటే అది క్లీవేజ్ అవుతుంది?’’ అని నిలదీస్తూ మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

తొలుత ఈ వీడియో ప్రారంభంలో ఏదో స్టయిల్ టిప్స్ చెబుతున్నారులే అన్నట్టుగా ఉంటుంది. వీడియో కొనసాగేకొద్దీ అది మగాళ్లపై సంధించిన వ్యంగ్యాస్త్రం అని అర్ధమవుతుంది. కొంత భాగం బ్లాక్ అండ్ వైట్, మిగిలిన సగం కలర్ లో ఈ వీడియో రన్ అవుతుంది. ఇందులో తొలుత స్వర భాస్కర్ ఆడపిల్లలు ఎంత నిండుగా దుస్తులు ధరిస్తే ఆగడాలు ఆగుతాయో, క్లీవేజ్‌ ను ఎలా ‘మేనేజ్’ చేయాలో చెబుతూ ఛలోక్తులు విసురుతుంది.

‘‘ఆఫీసులో ఉన్నప్పుడు మెడవరకు కప్పి ఉంచే దుస్తులు ధరించండి’’ అని స్వర అంటే ‘‘ఆ దుస్తులు మీకు ఊపిరి ఆడనంతగా కప్పి ఉంచాలి’’ అని వెంటనే తాప్సీ సైటైర్ వేస్తుంది. రోడ్డుపై నడిచేటప్పుడు, క్లబ్బులు, పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు ఎంత నిండుగా దుస్తులు ధరించాలో వ్యంగ్యంగా చెబుతూ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా తమ శరీర నిర్మాణంపై గర్వంగా ఉన్నామని తెలిపారు. తాము ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని గర్వంగా భావిస్తున్నామనీ చెప్పిన ఆ ఇద్దరూ మిగిలిన మహిళలంతా తమలా ఎవరికి నచ్చినట్టు వారు సంతోషంగా ఉండాలని సూచించారు. దేవుడు అన్నీ ఆలోచించే మనల్ని తయారు చేస్తాడనీ, పక్కనున్న వారు ఏదో అనుకుంటారని మనం భావిస్తే అది దేవుడి తప్పే అవుతుందని సూచించారు. ‘‘హౌ మచ్ క్లీవేజ్ ఈజ్ గుడ్ క్లీవేజ్’’ అంటూ విడుదల చేసిన ఈ వీడియో మధ్యాహ్నానికల్లా 1.56 లక్షల మందిని చేరుకుంది.

  • Loading...

More Telugu News