: అప్పుడే నిజమైన ఆనందం!: ఎన్టీఆర్ 'విమెన్స్ డే' శుభాకాంక్షలు


నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్, ‘బాహుబలి’ చిత్ర బృందం ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్, యువ హీరో సాయిధరమ్ తేజ్ కూడా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి ఫొటోను పోస్ట్ చేశాడు. ‘మహిళలని చిరునవ్వుతో ఉండేలా చేసినప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది. నా జీవితంలో చాలా ముఖ్యమైన ఇద్దరు మహిళల స్ఫూర్తితో.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

కాగా, యువహీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. ‘మహిళలను ఎలా గౌరవించాలో నాకు నేర్పించిన మా అమ్మ.. నా శక్తికి మూలం బలం. లవ్ యూ అమ్మ.. నేను నీ ప్రతిబింబాన్ని.. మహిళలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సాయి ధరమ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఒక వేదికపై సాయి ధరమ్ తన తల్లిని నడిపించుకుంటూ తీసుకువస్తున్న ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News