: ‘ఆధార్‌ పే’తో ఇక వినియోగదారుడు తన వద్ద స్మార్ట్ ఫోన్ లేకున్నా బిల్లు చెల్లించవచ్చు!


దేశంలో న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో కేంద్ర స‌ర్కారు ఈ రోజు మ‌రో యాప్‌ను విడుద‌ల చేసింది. 'ఆధార్‌ పే' పేరుతో లాంచ్ అయిన ఈ యాప్‌తో న‌గ‌దుర‌హిత లావాదేవీల్లో అక్ర‌మాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అంతేకాదు, క‌స్ట‌మ‌ర్ల‌ వ‌ద్ద మొబైల్ ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇందుకోసం బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. వ్యాపారి, దుకాణం దారుడి వ‌ద్ద ఉన్న ఆధార్ పే యాప్ లో వినియోగ‌దారుడు వేలి ముద్ర(బయోమెట్రిక్‌ పధ్ధతి) ఇచ్చి బిల్లులు చెల్లించుకోవచ్చు. దీని వ‌ల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ యాప్ ను వినియోగించడం వల్ల క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం ఆదా అవుతుంది.

ఈ యాప్‌ను వ్యాపారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌డంతో పాటు దానితో పాటు బయోమెట్రిక్‌ స్కానర్‌ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవాలి. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద ఆధార్ నెంబ‌రును తీసుకొని యాప్‌లో టైప్ చేయాలి. అనంత‌రం స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ వేలిముద్ర తీసుకొని బిల్లుని టైపు చేయాలి. దీంతో ఆటోమెటిక్‌గా వినియోగ‌దారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అవుతుంది.

  • Loading...

More Telugu News