: ఉమ్మడిగా నంబర్ వన్ స్థానంలో అశ్విన్, జడేజా... 9 ఏళ్ల తరువాత అరుదైన రికార్డు


దాదాపు 9 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా బౌలర్ డేల్ స్టెయిన్, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ లు కలసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఉమ్మడిగా టాప్ స్థానంలో నిలువగా, ఇప్పుడు భారత జట్టు బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఉమ్మడిగా తొలి స్థానాన్ని పంచుకుని అరుదైన రికార్డును నమోదు చేశారు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించగా, వీరిద్దరూ టాప్ స్థానాన్ని పంచుకున్నారు. వీరిద్దరూ 892 పాయింట్లతో ఉండటంతో, ఇద్దరికీ తొలి స్థానాన్ని ఇచ్చినట్టు ఐసీసీ పేర్కొంది. ఆ తరువాత మూడవ స్థానంలో హజెల్ వుడ్ం ఆపై హెరాత్, రబడాలు టాప్ 5లో నిలిచారు. బ్యాట్స్ మెన్ ల విషయానికి వస్తే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి 3వ స్థానం, పుజారాకు 6వ స్థానం దక్కాయి. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ నంబర్ వన్ గా ఉండగా, జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News