: నవ్యాంధ్ర అసెంబ్లీలో తొలి పలుకు మంత్రి అచ్చెన్నాయుడుదే!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రికార్డు సృష్టించారు. కొత్త అసెంబ్లీలో మొట్టమొదట గొంతు విప్పిన శాసనసభ్యుడిగా ఖ్యాతి గాంచారు. సోమవారం ప్రారంభమైన కొత్త సభలో తొలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం సభను వాయిదా వేశారు. రెండోరోజైన మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడు సమాధానంతోనే సభ ప్రారంభమైంది. ఎమ్మెల్యే శ్రవణ్ సహా మరికొందరు శాసనసభ్యులు విద్యుత్ పంపిణీ నష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన తరపున అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొత్త శాసనసభలో తొలి గళం తనదే కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.