: కోలీవుడ్ కలకలం...ధనుష్, అనిరుధ్ పై మరో బాంబేసేందుకు సిద్ధమైన సింగర్ సుచిత్ర
గత వారం రోజులుగా కోలీవుడ్ పరువుతీసి, సినీ నటులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్న ఆర్జే, సింగర్ సుచిత్ర ప్రముఖ నటుడు ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్ పై మరో బాంబేసేందుకు సిద్ధమైంది. సినీ నటీమణులు అమలాపాల్, ఆండ్రియా, హన్సిక మొత్వానీ, త్రిషా కృష్ణన్, సంచిత శెట్టి, పార్వతి నాయర్, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరుల రాసలీలల ఫోటోలు ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన సుచిత్ర, ప్రియమణి, ప్రియా ఆనంద్ ల రహస్య వీడియో, చిత్రాలు విడుదల చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దాని సంగతి అటుంచిన సుచిత్ర... తనను ధనుష్, అనిరుధ్ రేప్ చేసిన వీడియోను బయటపెడతానని ఇప్పుడు పేర్కొంది.
అయితే సుచిత్ర లీక్ లతో బెంబేలెత్తిన పలువురు ఫిర్యాదులు చేయడంతో ట్విట్టర్ ఆమె ఖాతాలను సస్పెండ్ చేసింది. దీంతో వేరే ఖాతా ద్వారా ఆమె పలు హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్, అనిరుధ్ తనపై ఒడిగట్టిన దారుణానికి సంబంధించిన వీడియోలు బయటపెడతానని చెప్పడంతో కోలీవుడ్ లో కలకలం రేగుతోంది. సుచిత్ర చేసిన లీక్ లతో కోలీవుడ్ పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పుడు ఇలాంటివి బయటకు వస్తే... సినీ నటులపై, నటనపై ఉన్న ప్రచారాలన్నీ నిజమని రుజువు చేసినట్టవుతుందని... ఇన్నేళ్లు సినీ పరిశ్రమ అద్భుతమైన ప్రపంచమని, క్రియేటివ్ వరల్డ్ అని చెప్పుకున్న ఆ అందాల సౌధం కుప్పకూలుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.