: వైఎస్ జగన్ పై రాజధాని రైతుల ఆగ్రహం!
రాజధాని అమరావతికి భూములిచ్చినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, ఇందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రచారం చేస్తున్నారని ఏపీ రాజధాని రైతులు మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతోందని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రయత్నాలకు ఆయన స్వస్తి పలకాలని, రాజధాని అభివృద్ధిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే కనుక, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి జగన్ తీసుకువెళ్లాలని రైతులు సూచించారు. అయితే, గ్రామ కంఠాలు, ఇతర సమస్యలను త్వరితగతిన ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని రాజధాని రైతులు అన్నారు.