: ఏపీ మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
ప్రత్యూష రిసోర్స్ సంస్థ హామీదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్కారు భూమిని తనఖా పెట్టి ప్రత్యూష రిసోర్స్ సంస్థ ఇండియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకుందని గతంలో దాఖలైన పిటిషన్ ఈ రోజు హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇందుకు సంబంధించిన రుణగ్రహీతలు, హామీదారులపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు గంటా శ్రీనివాసరావు సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.