: ఏపీలో ఎమ్మెల్యే కోటా 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏక‌గ్రీవం


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్యే కోటా 7 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ గ‌డువు ముగిసింది. అయితే, మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఆ ఏడు స్థానాలే ఏక‌గ్రీవం కానున్నాయి. అధికార టీడీపీ నుంచి నారా లోకేష్‌, బత్తుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖ‌లు చేశారు. ఎల్లుండి నామినేష‌న్ల ఉపసంహరణ గడువు ముగియ‌నుంది. రేపు నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ ఏడుగురి స‌భ్యుల ఎన్నిక‌ ఏకగ్రీవం కానుంది.

కాగా, నిన్న వైసీపీ తరపున డమ్మీ అభ్యర్ధిగా గంగుల సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్‌ దాఖలు చేయ‌గా, అందుకు పోటీగా ఈ రోజు తెలుగుదేశం కూడా మరో డమ్మీ నామినేషన్‌ దాఖలు చేయాల‌ని చూడ‌డంతో ఉత్కంఠ రేగింది. అయితే, ఆఖ‌రి నిమిషంలో ఇందిరారెడ్డి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో టీడీపీ డమ్మీ నామినేష‌న్‌ను వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది.

  • Loading...

More Telugu News