: మమ్మల్ని మాట్లాడనివ్వకుంటే.. చంద్రబాబుని మేము మాట్లాడనివ్వం: జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందు సభలో మాట్లాడిన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన సమయంలో తమను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవద్దని అన్నారు. ఒకవేళ తమను అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడే సమయంలో తాము కూడా ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి శాసనసభలో కేటాయించిన సమయం ముగిసినందున జగన్ ఇక మాట్లాడటం ఆపాలని స్పీకర్ సూచించిన సమయంలో జగన్ అభ్యంతరం తెలుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రతిపక్షాలను మాట్లాడకుండా అడ్డుకోవడం సరికాదని, తాము చెప్పేది అధికార పక్షం ఓపిగ్గా వినాలని ఆయన అన్నారు. తాము రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని ఆయన అన్నారు.