: చాప చుట్టేసిన టీమిండియా బ్యాట్స్ మెన్... ఆసీస్ విజయ లక్ష్యం 188 పరుగులు
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు. 274 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఆస్ట్రేలియా ముందు కేవలం 188 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 189 పరుగలకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్లలో హెచ్.వూడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ రెండు, ఓకీఫె రెండు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్‌లలో కేఎల్ రాహుల్ 51, ముకుంద్ 16, ఛటేశ్వర పుజారా 92, కోహ్లీ 15, జడేజా 2, రహానే 52, కేకే నాయర్ 0, సాహా 20 (నాటౌట్), అశ్విన్ 4, యాదవ్ 1, ఇషాంత్ శర్మ 6 పరుగులు చేయగా ఎక్స్‌ట్రాల రూపంలో భారత్‌కు 15 పరుగులు వచ్చాయి.