: ఏకాంతం నుంచి బయటకు వచ్చిన నాగార్జున!
ప్రముఖ హీరో నాగార్జున గత రెండు వారాలుగా ఏకాంతంగా గడిపారు. తన తాజా చిత్రం 'నమో వేంకటేశాయ' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం ఆయనను తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ను రూ. 36 కోట్లకు అమ్మగా... కనీసం రూ. 10 కోట్లను కూడా ఈ సినిమా వసూలు చేయలేక పోయింది. దీనికి తోడు తన కుమారుడు అఖిల్ వివాహం రద్దు కావడం కూడా ఆయనను చాలా డిస్టర్బ్ చేసింది. దీంతో, ఆయన అన్నిటికీ దూరంగా ఏకాంతంగా గడిపారు. తాజాగా ఆయన ఏకాంతం నుంచి బయటకు వచ్చారు.
తన కొత్త సినిమా 'రాజుగారి గది-2' సినిమా షూటింగ్ కు నాగార్జున హాజరవుతున్నారు. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో తీసిన ఓ ఫొటోను ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. 'బ్యాక్ టు బిజినెస్ విత్ రాజుగారి గది' అంటూ కామెంట్ పెట్టారు.