: ఏపీలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. పలు రాష్ట్రాలు ఈ పథకం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ లాంటి పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ వాటర్ గ్రిడ్ పథకానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ బోర్డుకు ఛైర్మన్ గా తన సోదరుడు కేఈ ప్రభాకర్ కు బాధ్యతలను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలిపారు.