: బాధితులకు న్యాయం చేస్తాం.. హామీ ఇచ్చిన అమెరికా
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేష దాడులపై ఆ దేశం స్పందించింది. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అమెరికా జాతి విద్వేష బాధితులకు సత్వరం న్యాయం చేస్తామని ప్రకటించింది. ఈ విషయంలో పూర్తి హామీ ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత భారతీయులకు సత్వరం న్యాయం జరిగేలా చూసే పూచీ తమదంటూ ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందినట్టు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.