: అభిషేక్, ఐశ్వర్యల మధ్య విభేదాలకు కారణం ఆరాధ్య?
బాలీవుడ్ జంట అభిషేక్, ఐశ్వర్యా రాయ్ ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వారు విడిపోతారనే వదంతులు మొన్నటి వరకు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ‘అలాంటిదేది లేదు’ అని అభిషేక్, ఐశ్వర్యలు ఖండించడం తెలిసిందే. తాజాగా, మరోమారు ఆ తరహా వదంతులు బాలీవుడ్ లో వినపడుతున్నాయి. అయితే, వారి మధ్య విభేదాలకు కారణం వారి గారాలపట్టి ఆరాధ్య అని తెలుస్తోంది.
చిన్నారి ఆరాధ్యను ఇప్పటి నుంచే సినిమాల్లోకి తీసుకువద్దామని, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరాధ్యను పరిచయం చేస్తే.. రేపు హీరోయిన్ కావడానికి రూట్ క్లియర్ అవుతుందని అభిషేక్ వాదనట. దీనికి, ఐశ్వర్యా రాయ్ మాత్రం ఒప్పుకోవడం లేదట. ఆరాధ్యను ఇప్పటి నుంచే స్క్రీన్ ముందుకు తీసుకురావడం ఎందుకని ఆమె ప్రశ్నిస్తోందట. పెరిగి పెద్దయిన తర్వాత ఆరాధ్య తాను ఏం కావాలో అది అవుతుందని, అప్పటి దాకా వేచి చూద్దామని ఐశ్వర్య అంటోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వ్యవహారం రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లడంతో సీరియస్ అయిందట.