: జయలలిత ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే శశికళ సహించలేకపోయేది!: జయ సెక్యూరిటీ కారు డ్రైవర్
తమిళనాడు సీఎం పీఠాన్ని చేజిక్కుంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమై, అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి శశికళ జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇదిలా ఉండగా.. శశికళ మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందనే విషయాన్ని జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో కారు డ్రైవర్ గా పని చేసే దివాకర్ (42) ప్రస్తావించాడు. 2005 నుంచి 2009 వరకు జయలలితకు భద్రతగా వెళ్లే ఓ కారులో తాను డ్రైవర్ గా పని చేసే వాడినని చెప్పాడు. ‘అమ్మ’ జయలలిత ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే శశికళ ఓర్వలేకపోయేదని, వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టేదని ఆరోపించాడు. కొడనాడు ఎస్టేట్ లో ఈ విధంగా జరిగిన కొన్ని సంఘటనలు గుర్తున్నాయని.. తనకు తెలిసి శశికళ నలుగురిని కొట్టి ఎస్టేట్ నుంచి పంపించి వేసిందని అన్నాడు. జయలలిత మృతిపై తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని దివాకర్ అన్నాడు.