: ఏపీ సచివాలయంలో తెలంగాణ ఎమ్మెల్యే
అమరావతిలోని ఏపీ సచివాలయానికి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ రోజు వచ్చారు. ఓటుకు నోటు కేసులో తమ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు నేడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అమరావతికి వచ్చిన సండ్ర... తాజా పరిణామాలపై పలువురితో చర్చించారు. ఓటుకు నోటు కేసులో సండ్ర ఐదో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది.