: అర్ధసెంచరీ సాధించిన మరో టీమిండియా ఆటగాడు!


బోర్డర్-గవాస్కర్ పేటీఎం టెస్టు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లలో టీమిండియా బ్యాట్స్ మన్ ఆటతీరు ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసింది. భారతీయ ఆటగాడు రెండంకెల స్కోరు చేస్తే అదే మహద్భాగ్యమన్నట్టు యువ ఆగాళ్లు ఆడుతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వరల్డ్ నెంబర్ వన్ జట్టు ఆటతీరు ఇదా? అని ఆశ్చర్యపోయే రీతిలో మన బ్యాట్స్ మన్ చెత్త ఆటను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో టీమిండియా ఓపెనర్ కేఎల్.రాహుల్ రెండు ఇన్నింగ్స్ లలో అర్ధ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

రాహుల్ తరువాత మరో టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (50) అర్ధ సెంచరీ సాధించడం విశేషం. టెస్టు బ్యాట్స్ మన్ అన్న ట్యాగ్ తో టెస్టుల్లో స్థానం సంపాదించే పుజారా మొక్కవోని దీక్ష, సడలని ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. బీటలు వారిన పిచ్ పై బంతి ఏమాత్రం పైకి లేవకున్నా పుజారా సహనం కోల్పోలేదు. 127 బంతులాడిన పుజారా 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడంటే ఎంత ఓపిక ప్రదర్శించాడో ఊహించొచ్చు. అతనికి జతగా అజింక్యా రహానే (20) క్రీజులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు 55 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ పై 72 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

  • Loading...

More Telugu News